పెరలి మ‌హిళ‌కు క‌లెక్ట‌ర్ అభినంద‌న‌

పెరలి మ‌హిళ‌కు క‌లెక్ట‌ర్ అభినంద‌న‌

గొర్రెల యూనిట్‌తో ఆర్థికాభివృద్ధి సాధించిన శాలిని

కర్లపాలెం అక్టోబర్ 20 ఆంధ్రప్రభ : మండలం లోని పెరలి గ్రామానికి చెందిన దాసరి చిన్నోడు భార్య శాలిని కష్టాల‌కోర్చి.. స్వ‌యం స‌మృద్ధితో జీవితాన్ని మార్చుకున్నారు. కప్పుడు ఐదు గొర్రెలతో జీవనం సాగించిన ఆమె, చైతన్య గ్రామ సమాఖ్య పరిధిలోని క్రిస్టియన్ మహిళా స్వయం సహాయక బృందం సహకారంతో రూ.5 లక్షల ప్రాజెక్టు తీసుకుని 40 గొర్రెల యూనిట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 42 గొర్రెల యజమానిగా స్థిరమైన ఆదాయం ఆర్జిస్తూ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆర్థిక సహాయం సరైన దిశలో వినియోగిస్తే మహిళల జీవితం ఎలా మారుతుందో చూపించిన ప్రేరణాత్మకు శాలిని ఉదాహరణ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీవిత పోరాటంలో సమస్యలను అడగమించి ఆర్థిక వృద్ధి సాధించిన శాలినిని కలెక్టర్ అభినందించారు.

Leave a Reply