త‌వ్వ‌కాల‌ను అడ్డుకున్న పోచారం గ్రామ‌స్థులు

నాగిరెడ్డిపేట, ఆంధ్ర‌ప్ర‌భ : పోచారం ప్రాజెక్టు పక్కనే ఉన్న ఏనెగుట్ట తవ్వకాలను ఈ రోజు గ్రామస్తులు అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా గుట్టను తవ్వుతున్న విషయం తెలుసుకున్న పోచారం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లి పనులను అడ్డుకొన్నారు. గుట్టను తవ్వడం వల్ల రానున్న రోజుల్లో వరద నీరు గ్రామంలోకి వచ్చే ప్రమాదముందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఏనేగుట్ట పూర్తిగా తవ్వడాన్ని సంబంధిత సంస్థ యాజమాన్యం పనులు నిలుపుచేయాల‌ని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీంతో సంబంధిత సంస్థ కాంట్రాక్టర్ ప్రతినిధి తమ యజమానికి గుట్ట తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారన్న విషయాన్ని వివరించి పనులను ఆపేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నర్సాగౌడ్, గోపాల్ గౌడ్, శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్ కుంటోళ్ల యాదయ్య, గ్రామ పెద్దలు బాపూరావు, మల్లారెడ్డి, కిరణ్ కుమార్, సంగమేష్, రమేష్ గ్రామ కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply