వెల్గటూర్, ఆంధ్రప్రభ : ఓ విద్యార్థిని చదువు కోసం ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామానికి చెందిన అనుమాల రాజయ్య, లక్ష్మి కుమార్తె అంజలి ఎంసెట్ లో 10, 769 ర్యాంకు సాధించింది. ఎంసెట్ కౌన్సెలింగ్ లో హన్మకొండ శ్రీ రాజరాజేశ్వర ఉమెన్స్ కళాశాలలో బీఫార్మసీ సీటు కేటాయించారు.
ఇక్కడ చదువుకోవడానికి రూ.35 వేలు ఫీజు, వసతి గృహంలో ఉండటానికి ఏడాదికి రూ.60 వేలు, మొత్తం 95 వేల రూపాయలు ఫీజులు కట్టవలసి ఉంటుంది. పేదంటికి చెందిన ఆ కుటుంబానికి అంత డబ్బులు కట్టే స్తోమత లేదు. తన కుమార్తె ఉన్నత చదువులు కోసం దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్నారు.