సాగునీటి హక్కుల పరిరక్షణే ధ్యేయం

రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బోజ్జా దశరథ రామిరెడ్డి
అక్టోబర్ 24న నంద్యాలలో బహిరంగసభ

నంద్యాల బ్యూరో అక్టోబర్ 19 ఆంధ్రప్రభ : రాయలసీమను ఎడారి కానివ్వ‌మ‌ని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడుబోజ్జా దశరథ రామిరెడ్డి పేర్కొన్నారు. సాగునీటి హక్కుల పరిరక్షణే ధ్యేయమ‌ని ప్ర‌క‌టించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో, ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక భాగస్వామ్యంతో ఈ నెల 24న‌ నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్‌లో ఉదయం బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు దశరథ రామిరెడ్డి తెలిపారు.. ఆదివారం కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు..ఈ బ‌హిరంగ స‌భ‌కు సభకు ఐక్యవేదిక చైర్మన్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, కన్వీనర్ మహాదేవ్, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజా సంఘాల నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.

బొజ్జ మాట్లాడుతూ..శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాయలసీమ రైతులు 60 వేల ఎకరాలు త్యాగం చేసినప్పటికీ, ప్రాజెక్టు రూపకల్పనలో తీరని ద్రోహం జరిగిందన్నరు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు నాలుగు దశాబ్దాల క్రితం ఎస్ ఆర్ బి సి , హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయని పేర్కొన్నారు. రాయలసీమ నీటి హక్కులను రక్షించేందుకు, రాయలసీమకు న్యాయం జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు పనులు, పంటకాలువల నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు బచావత్ ట్రిబ్యునల్, రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులను అమలు పరచాలన్నారు.


స‌మావేశంలో సమితి ఉపాధ్యక్షులు వై. యన్‌. రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, నాగప్ప గారి పెద్ద ఉశేని, బెక్కం చిన్న రామకృష్ణారెడ్డి, కొమ్మా శ్రీహరి, మహేశ్వర రెడ్డి, మహబూబ్ భాష, కృష్ణమోహన్ రెడ్డి, భాష్యం సుబ్బనరసయ్య, ఏరువ రామిరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, భాస్కర్ రెడ్డి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply