మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మోతె, ఆంధ్రప్రభ : రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు, నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. శనివారం మోతె మండల పరిధిలోని సిరికొండ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీపీసీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తేమశాతం 17% ఉండేవిధంగా ధాన్యం ఆరబెట్టాలని, తడిసిన ధాన్యం లారీలలో వేరుగా పంపాలని, లేనట్లయితే మిల్లుల దగ్గర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ కొండపల్లి వెంకట్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్, సీఈవో అనంత రెడ్డి, డైరెక్టర్ సామ ప్రభాకర్ రెడ్డి, ఏఈవో ప్రియాంక, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply