తండ్రిని హ‌త‌మార్చిన కొడుకు

తండ్రిని హ‌త‌మార్చిన కొడుకు

జన్నారం, ఆంధ్రప్రభ : తాగుడుకు బానిసైన కొడుకు కన్న తండ్రిని ఇంట్లో గొడ్డలితో నరికి చంపిన సంఘటన ఇది. మంచిర్యాల జిల్లా జన్నారం(Jannaram) మండలంలోని సేవదాస్ నగర్‌కు చెందిన జాదవ్ శంకర్ నాయక్(Jadav Shankar Naik)(45)ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఇంట్లో కొడుకు జాదవ్ నూర్ సింగ్ నాయక్ గొడ్డలితో తలపై నరికి హతమార్చాడు.

విషయం తెలుసుకున్న లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి(Ramanamurthy), స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహమైంది.

Leave a Reply