చెన్నూరులో మంత్రి పాదయాత్ర
చెన్నూరు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాన్నున స్థానిక ఎన్నికలు 42 శాతం బీసీ రిజర్వేషన్ తోనే జరుగుతాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Gaddam Vivek Venkataswamy) అన్నారు. బీసీ రిజర్వేషన్ పై నిర్వహించిన తెలంగాణ బంద్ కార్యక్రమానికి కార్యకర్తలతో కలిసి చెన్నూరు పట్టణంలో పాదయాత్ర నిర్వహించి స్వచ్ఛందంగా వ్యాపారులు పాల్గొనాలని కోరారు.
ఇందుకు వ్యాపారులు కూడా సహకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ (Telangana) రాష్ట్రంలో 42శాతం రిజర్వేషన్ తో ఎన్నికలు జరిగితే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీ కి దక్కుతుందన్న నెపంతో కేంద్రం బీసీ రిజర్వేషన్ కు సహకరించడం లేదని ఆరోపించారు.

