ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

మెదక్ ఎమ్మెల్యే మైనాంపల్లి రోహిత్ రావు….

నిజాంపేట, అక్టోబర్18(ఆంధ్రప్రభ) : మండల పరిధిలోని నస్కల్,నందగోకుల్ తిప్పనగుల్ల, గ్రామాలలో శనివారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు (RohitRao) పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంద్రమ్మ ఇండ్ల పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేసుకొని విడుతల వారీగా డబ్బులను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండలంలోని పలు ఇందిరమ్మ ఇండ్ల (Indiramma’s house) ను సందర్శించామన్నారు. గ్రామాలలో ప్రజలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం గ్రామంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారని భవిష్యత్తులో నిజాంపేట (NizamPet) మండలాన్ని మరింత అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తామన్నారు. అనంతరం బచ్చు రాజు పల్లి, జెడ్ చెరువు తాండ గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వ ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలను సద్వినియం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, మిషన్ భగీరథ ఏఈబిక్షపతి, శరత్,తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, సుప్రభాతరావు,తాజా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, రమేష్ రెడ్డి, సీనియర్ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్,మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, కొమ్మాట బాబు, యూత్ అధ్యక్షులు రామచందర్ నాయక్, లింగం గౌడ్, దేమేయాదగిరి, ఆకుల బాలయ్య, అందేస్వామి అజయ్, వినోద్ నాయక్, శ్రీనివాస్ నాయక్, నాగరాజు, సూరా రాములు, గరుగుల శ్రీనివాస్, ఆర్ ఐ ఇమాద్, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం అశోక్, కార్యదర్శులు నాగలక్ష్మి, మమత, రాము, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply