మూడు రకాల చోరీ కేసులు ఛేదన

  • ఆరుగురు నిందితుల అరెస్టు
  • 12 లక్షల విలువ చేసే బంగారు, కారు స్వాధీనం
  • 9 పోలీస్ స్టేషన్లో పరిధిలో 22 కేసుల నమోదు
  • పరారీలో మరో ముగ్గురు ..
  • ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లాలో మూడు రకాలుగా చోరీలకు పాల్పడే ఆరుగురు దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్(Satish Kumar) తెలిపారు. మరో ముగ్గురు దొంగలు పరారీలో ఉన్నార‌ని, వారిని కూడా త్వ‌ర‌లో ప‌ట్టుకుంటామ‌ని తెలిపారు. అరెస్టు సందర్భంగా నిందితుల నుంచి రూ.12 లక్ష రూపాయల విలువ చేసే బంగారు కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అందరిపై జిల్లాలోని 9 పోలీస్ స్టేషన్ల‌(police station) పరిధిలో 22 కేసులు నమోదయినట్లు వివరించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివ‌రాలు వెల్ల‌డించారు.

బెట్టింగ్ వ్యసనాలకు అలవాటు పడి పుట్టపర్తి పట్టణం బ్రాహ్మణపల్లి, ఒడిసి, గోరంట్ల, సోమందేపల్లి, కియా పోలీస్ స్టేషన్(Brahmanapalli, Odici, Gorantla, Somandepalli, Kia Police Station), రొద్దం ప్రాంతాలలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని, ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడేవారు. 2024 -25 నుంచి ఓబుల దేవర చెరువు, నల్లమాడ,అమడగూరు, బుక్కపట్నం, పుట్టపర్తి రూరల్, రామగిరి, కదిరి, తలుపుల, గాండ్లపెంట మండలాల్లోని రైతుల పొలాల వద్ద ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మ‌ర్ల అల్యూమినియం దొంగలిస్తూ వచ్చేవారు.

ఈ సందర్భంగా వీరి నుంచి రూ 5 లక్షల,7,200 లు విలువచేసే 657 కిలోల అల్యూమినియం వైరును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అదేవిధంగా కదిరి, గాండ్లపెంట, ముదిగుబ్బ, తనకల్లు, కదిరి రూరల్(Kadiri Rural) అప్డేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని దేవాలయాలలో ఉండిలను పగలగొట్టి నగదును, వెండి, బంగారు ఆభరణాలను దొంగతనాలు చేసే ముగ్గురు ముద్దాయిలు ఒక రిసీవర్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా వీరు నుంచి ఒక లక్ష 16 వేల నగదు, నాలుగు బంగారు తాళిబొట్లు, నాలుగు అమ్మవారి వెండి ముఖాలు (వాటి మొత్తం విలువ రూ.2,16,500 )స్వాధీనం చేసుకున్నారు.

కావడి శ్రీనివాసులు అలియాస్ ఎరుకల శ్రీనివాస్ 35 సంవత్సరాలు, మస్తీ గ్రామము, మాలూరు తాలూకా, కోలార్ జిల్లా. ప్రస్తుత నివాసం రామచంద్రపురం శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా. బండి సోమశేఖర్ అలియాస్ ఎరుకల సోమశేఖర్(BANDI SOMASEKAR ALIAS ERUKALA SOMASEKAR) వయసు 30 సంవత్సరాలు, ఎర్రయ్య గారి పల్లి కలగడ మండలం అన్నమయ్య జిల్లా మెనుపడి రమేష్ అలియాస్ ఎరుకల రమేష్ వయసు 32 సంవత్సరాలు, శీతోలపల్లి గ్రామము బి కొత్తకోట మండలం అన్నమయ్య జిల్లా రిసీవర్ కొండాచారి వయసు 63 సంవత్సరాలు గాంధీ నగరం, చింతామణి,కర్ణాటక. పరారీలో ఉన్న ముద్దాయిలు కావడి రాజేంద్ర వయసు 40 సంవత్సరాలు, పుంగనూరు,చిత్తూరు జిల్లా. కావలి శేఖర్ వయసు 35 సంవత్సరాలు, రామసముద్రం, అన్నమయ్య జిల్లా. కావడి అరుణాచలం 30 సంవత్సరాలు రామసముద్రం అన్నమయ్య జిల్లా.

జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాలో జరిగిన చోరీలపై ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పుట్టపర్తి, కదిరి డీఎస్పీలు విజయకుమార్, శివ నారాయణ స్వామి(VIJAYKUMAR, SHIVA NARAYANASWAMY) పర్యవేక్షణలో నల్లమాడ సీఐ నరేంద్ర రెడ్డి, ఓడీసీ ఎస్ ఐ బి. మల్లికార్జున రెడ్డి, నల్లమాడ పిఎస్ఐ ఎం సతీష్, అమడగూరు పిఎస్ఐ ప్రదీప్ రాజ్,సిసిఎస్ ఇన్స్పెక్టర్ సతీష్ వారి సిబ్బందితో ఒక ఉమ్మడి బృందంగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఒడి చెరువు మండలం కుసుమ వారిపల్లికి పోవుదారిలో గల కె భాస్కర్ రెడ్డి తోట వద్ద కల్వర్టు కింద పై తెలిపిన ఐదుగురు ముద్దాయిలు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారిని పట్టుకుని, విచారించగా 2024- 25 సంవత్సరంలలో పలు ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలలో తమ పాత్ర ఉన్నట్టు ఒప్పుకున్నారు.

ఈ కేసులలో దర్యాప్తు లో ముద్దాయిల అరెస్టు దొంగ సొత్తు రికవరీలో చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసులు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన పుట్టపర్తి సీఐ శివాంజనేయులు, నల్లమాడ సర్కిల్ సీసిఐ నరేందర్ రెడ్డి(CCI Narender Reddy), ఓడీసీ ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి, గాండ్లపెంట రవికుమార్, నల్లమాడ పీఎస్ఐ ఎం సతీష్, అమడుగూరు పీఎస్ఐ,జిల్లా పోలీస్ కేంద్రంలో ఉండే సీసీఎస్ ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్ఐ మధు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, సివి రమణ,కానిస్టేబుల్స్ గోవర్ధన్,ప్రతాప్, రమేష్ నాయక్ శంకర్లతో పాటు హోంగార్డుల(Homeguard)ను జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. స‌మావేశంలో పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామి తోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు ఉన్నారు.

Leave a Reply