శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు
బాసర, ఆంధ్రప్రభ : విజయ యాత్రలో భాగంగా బాసర పుణ్యక్షేత్రానికి దక్షిణామ్నాయ శృంగేరి పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి మహాస్వామి(Sri Sri Vidusekara Bharati Mahaswami) ఈ రోజు బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవీ ఆలయానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, శ్రీ మహా లక్ష్మీ, శ్రీ మహాకాళి అమ్మవార్ల(Sri Mahakali Ammavarla)కు వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. అభిషేక అర్చన, కుంకుమార్చన, హారతి పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యాలయంలో ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్(Master Plan) కోసం ఎమ్మెల్యే పవర్ రామారావు, పటేల్ దక్షిణామ్నాయ శృంగేరి పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి మహాస్వామికి వివరించారు.



