భీమ్గల్లో బంద్
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్ ప్రభావం భీమ్గల్(Bheemgal)లో కనిపించింది. ఈ సందర్భంగా ర్యాలీ కూడా నిర్వహించారు. బస్సులు తిరగడం లేదు. వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీ స్వామి, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య(JJ Narsaiah), డీసీసీ డెలికేట్ ప్రధాన కార్యదర్శి కుంటా రమేష్, మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్ది అవినాష్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ పల్లికొండ దొనకంటి రాజేష్(allikonda Donakanti Rajesh), ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

