బీసీ బంద్ ప్ర‌భావం

నడవని బస్సులు ఇబ్బందులు పడిన ప్రయాణికులు
ఉట్నూర్‌లో కొన‌సాగుతున్న బంద్‌


ఉట్నూర్, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ అదిలాబాద్ (Adilabad) జిల్లా ఉట్నూర్ బీసీ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. వ్యాపార న‌ముదాయాలు స్వ‌చ్ఛ‌దంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు కూడా తిర‌గ‌క‌పోవ‌డంతో రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారాయి. బీసీ సంఘాల నాయకులు ఉట్నూరు (Utnoor)లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉట్నూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు పర్యవేక్షించారు.

Leave a Reply