నల్లగొండలో బంద్ ప్రశాంతం
తెరుచుకోని వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు
గట్టుప్పల, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ): బీసీలకు 42% రిజర్వేషన్లు (BC Reservations) కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో అన్ని వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు (RTC buses) డిపోలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్,సీపీఎం తెలుగుదేశం పార్టీల నాయకలు బంద్‌లో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా గట్టుప్పల్‌లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ ఐ సంజీవరెడ్డి పోలీసులతో కలిసి పర్యవేక్షించారు.

