- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కి కలిసిన ఉట్నూర్ కాంగ్రెస్ నేతలు
ఉట్నూర్, (ఆంధ్రప్రభ) : అదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు ఇవ్వాలని ఉట్నూర్ కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్‌లో జరిగిన కార్యక్రమానికి కర్ణాటకకు చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ సింగ్ అబ్జర్వర్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉట్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను కలిసి, ఆదిలాబాద్ డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్ష పదవిని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు కేటాయించాలని కోరారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని కలిసిన వారిలో ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఆత్రం రాహుల్, ఆదిలాబాద్ ఆర్టీఏ నెంబర్ దూట రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెస్రం ఉమేష్, కొత్తపెల్లి మహేందర్, బిరుదుల లాజర్, మహిళా నాయకురాళ్లు పేందూర్ కళావతి, మెస్రం భాగ్యలక్ష్మి, సులోచన బాయి, అన్నపూర్ణ తదితర నియోజకవర్గ నాయకులు ఉన్నట్లు తెలిపారు.

