న‌కిలీ మ‌ద్యం కేసులో 23మందిపై కేసు

పరారీలో 9 మంది నిందితులు


మదనపల్లె, అక్టోబర్ 17 ఆంధ్రప్రభ : ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్‌ పోలీసులు (Excise Police) శుక్ర‌వారం పదిమంది నిందితుల‌ను క‌స్ట‌డీకి తీసుకున్నారు. మొలకలచెర్వు మండలంలో నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. మొత్తం 23 మందిపై కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

వారిలో జనార్ద‌న్ రావు, కట్ట రాజు, సి.బాలరాజు,టి. రాజేష్, గణేష్, అనంత శ్రీనివాసన్, సూర్య, వెంకటేషన్ సురేష్, మిథున్ దాస్, కె. శ్రీనివాస్ రావు, సురేంద్ర, కె.నాగరాజు, బాలాజీ, యన్. రవి, దాసిరిపల్లి జయచంద్ర రెడ్డి, మంత్రి గిరిదర్ రెడ్డి, అంబురాసు, పి. సుదర్శన్, ఆశ్రఫ్, చైతన్య, శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు. మదనపల్లె ఎక్సైజ్‌ కార్యాలయం (Madanapalle Excise Office)లో నిందితులను కొంతసేపు విచారించారు. కస్టడీకి ప్రధాన నిందితుడు సురేంద్రనాయుడు, కట్టా రాజుసహా 10 మంది నిందితులు ఉన్నారు..వారిని రిమాండ్ కు పంపారు.. యన్. రవి, దాసరిపల్లి జయచంద్ర రెడ్డి, మంత్రిగిరిదర్ రెడ్డి, అంబురాసు,పి. సుదర్శన్,చైతన్య, శ్రీనివాసరెడ్డి తో సహా 9 మంది నిందితులను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు.

Leave a Reply