సంగంబండలో చేప పిల్లలను వదిలిన మంత్రులు

మక్తల్, అక్టోబర్ 17 (ఆంధ్రప్రభ) : మత్స్య‌ సంపద (Fisheries) ను అభివృద్ధి చేయడం మత్స్య కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 100శాతం సబ్సిడీ పై చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని సంగంబండ బాలెన్సింగ్ రిజర్వాయర్ లో చేప పిల్లలను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Vakiti Srihari) తో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodhar Rajanarasimha) విడుదల చేశారు.

ఈ సందర్భంగా మత్స్య‌ సహకార సంఘం సభ్యులు మంత్రులకు ఘనంగా స్వాగతం పలికారు. చేప పిల్లల విడుదల కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికా రెడ్డి, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, షాద్ న‌గర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినిత్, ఫికె ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి, డిసిసి అధ్యక్షులు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply