ఆర్మూర్, ఆంధ్రప్రభ : ఆర్మూర్ పట్టణంలో రాజారాం నగర్ కాలనీ వద్ద అక్రమంగా తరలిస్తున్న ప్రజా పంపిణీ (రేషన్) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాజారాం నగర్ కాలనీ వద్ద ఓ డీసీఎం లారీని తనిఖీ చేయగా, అందులో సుమారు 65 క్వింటాళ్ల 119 సంచుల రేషన్ బియ్యం లభించింది.
వాహన డ్రైవర్, పెర్కిట్‌కు చెందిన సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, రాజారాం నగర్ కాలనీకి చెందిన మధనం ఎల్లయ్య, సంజీవులు ఈ బియ్యాన్ని అడవి మామిడిపల్లిలోని నాగేష్ రైస్ మిల్లుకు తరలించమని చెప్పినట్లు వెల్లడించాడు.
వెంటనే వాహనాన్ని, డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐచర్ డ్రైవర్, వాహన యజమాని సోహెల్, బియ్యం సరఫరా చేస్తున్న మధనం ఎల్లయ్య, సంజీవ్, రైస్ మిల్ యజమాని నాగేష్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

