అశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి నిధులు
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆశిఫాబాద్(Ashifabad) జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని బాండేర్ గ్రామానికి మంజూరైన అశ్రమ పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఈ రోజు హైదరాబాదు(Hyderabad)లో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సభ్యశాసి గోస్ కు తన ఛాంబర్ లో కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు బాండేర్ వీటీడీఏ అధ్యక్షుఉ కొమురం భీమ్రావు తెలిపారు.
ఆసిఫాబాద్ డి టీడీవో(Asifabad D TDO) రాసి ఇచ్చిన పత్రాన్ని వివిధ మంజూర్ల కోసం ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

