ఆ కేసులో ఇద్దరి బైండోవర్..

జన్నారం, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అక్రమంగా టేకు చెట్లను నరికిన ఇద్దరు వ్యక్తులను బైండోవర్ చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

జన్నారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గొండుగూడ ఫారెస్ట్ బీట్‌లో అడవుల్లోకి అక్రమంగా ప్రవేశించిన జువ్వగూడ గ్రామస్థులైన జాదవ్ సూదం నాయక్, దేవిదాస్ నాయక్ టేకు చెట్లను నరికివేశారు.

వీరిని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుమారస్వామి, బీట్ ఆఫీసర్ లాల్భాయ్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ ఇద్దరు నిందితులను స్థానిక తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి ఎదుట హాజరుపరిచారు.

తహసీల్దార్ ఆదేశాల మేరకు, ఆ నిందితులు భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు హామీనిస్తూ బాండ్ పేపర్‌పై ఒప్పందం (బైండోవర్) రాయించుకున్నారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు స్థానిక ఇన్‌చార్జి రేంజ్ ఆఫీసర్ పి. మమత సాయంత్రం వెల్లడించారు.

Leave a Reply