బీఎల్ఓలకు ప్రత్యేక ఉప కలెక్టర్ సూచన
ఓటరు జాబితాపై బుత్ స్థాయి అధికారులతో సమీక్ష
ఇచ్ఛాపురం, అక్టోబర్ 16 ( ఆంధ్రప్రభ ): ఓటరు జాబితా తయారీ (Voter List Update) లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ ఓ )లు ప్రలోభాలకు లొంగొద్దని ప్రత్యేక ఉప కలెక్టర్ బి పద్మావతి (B Padmavathi) సూచించారు. నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ) హోదాలో ఆమె బీఎల్వోలతో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి బీఎల్ ఓ తన యాప్ లో ఫారం 6 ఓటరు చేర్పులు, ఫారం 7 తొలగింపులు, ఫారం 8 మార్పులు గురించి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎవరి ప్రలోభాలకు లొంగకుండా తొలగింపులు, నివాసం మార్పులు చేయరాదన్నారు. 2002 నాటి ఓటర్ల జాబితా డేటా ప్రతి బీఎల్ ఓ (BLO) వద్ద అందుబాటులో ఉందన్నారు. నామకరణం లేదా పార్ట్ నంబర్‌లో మార్పు ఉన్నప్పటికీ, 2002 నాటి అదే ప్రాంతం లేదా వీధిని 2025 నాటి దానితో మ్యాప్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆయా మండలాల తహసీల్దార్‌లు ఎన్.వెంకటరావు, బి మురళి మోహనరావు, ఎన్ ,రమేష్ , బి .అప్పల స్వామి లతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు.

