50 మంది పిల్లలు లేని మహిళలను పరీక్ష‌లు

50 మంది పిల్లలు లేని మహిళలను పరీక్ష‌లు

శావల్యాపురం, (ఆంధ్రప్రభ) : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని ప్రముఖ సంతాన సాఫల్య నిపుణులు శ్రేయ హాస్పిటల్ ఆధ్వ‌ర్యంలో మండల కేంద్రమైన శావల్యాపురంలో సుచరిత ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీరామ పబ్లిక్ పాఠశాలలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఐవీఎఫ్ నుంచి డాక్టర్ వసంత కిరణ్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ పాల్గొని 50 మంది పిల్లలు లేని మహిళలను పరీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ వసంత మాట్లాడుతూ 20 మందికి మెరుగైన వైద్యం కొరకు ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందని, వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ పాఠశాల కరస్పాండెంట్ కెవిఆర్ మోహన్ చంద్ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply