శిక్ష‌ణ ప్ర‌మాణాల‌పై ప‌లు సూచ‌న‌లు..

శిక్ష‌ణ ప్ర‌మాణాల‌పై ప‌లు సూచ‌న‌లు..

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాద్ జిల్లా(Nizamabad District) కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాన్ని ఈ రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టీ. వినయ్ కృష్ణ రెడ్డి(T. Vinay Krishna Reddy) సందర్శించి పరిశీలించారు. నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(Advance Technology Center) (ఏటీసీ)లోని మిషన్ వర్క్(Mission Work), హాస్టల్ వసతి, పవర్ కనెక్షన్, ఫర్నిచర్, సివిల్ వర్క్, ట్రాస్పరెంట్ తదితర అంశాలపై శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపాల్ కోటిరెడ్డి(Kotireddy)ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇంకా అవసరం ఉన్నమౌలిక వసతుల గురించి మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, శిక్షణ ప్రమాణాలపై పలు సూచనలు చేశారు. ఆయా కోర్సులలో పూర్తీ స్థాయిలో అభ్యర్థులు ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట తహశీల్దార్ గుడిమేల ప్రసాద్(Gudimela Prasad), ఎంపీడీఓ చింత రాజ శ్రీనివాస్, ఆర్ ఐ శరత్, ఎంపీఓ సదాశివ్, ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎటిఓ సంతోష్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply