TG | సీఎం రేవంత్ పై బండి సంజయ్ ఫైర్
ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గమంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో స్పందించారు. ప్రధాని మోదీపై సీఎం చేసిన పరిశోధన పూర్తిగా విఫలమైందని అన్నారు. 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రధాని మోదీ కులాన్ని ఓబీసీగా జాబితాలో చేర్చారని తెలిపారు
42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరో డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపిందని.. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ ప్రధానమంత్రి కులంపై చర్చ మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు.
మోడీ కులం పై మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏ కులం..? అతని మతం ఏమిటి..? చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన కులం మతం సీఎంకు కూడా తెలియదన్నారు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ.
ఇప్పుడు ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో అనే చర్చ చేయాలని అనుకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా 10 జనపథ్ నుంచి చర్చ పెట్టాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంత దృష్టి మరలించాలని ప్రయత్నించిన అది పని చేయదని.. ఇప్పటికే బీజేపీ తరుపున మా నిర్ణయం కేల్చి చెప్పామన్నారు.
బీసీ జాబితాలో ముస్లింలను చేరుస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని… అలాంటి ఎంతటి ప్రయత్నమైనా అడ్డుకునేందుకు సిద్ధం గా ఉన్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.