అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం

తిరుచానూరు సీఐ, సునీల్ కుమార్
దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వ‌ద్ద సోదాలు
17 బైకులు, 13 ఆటోలు, ఒక కారు స్వాధీనం

తిరుపతి క్రైమ్ అక్టోబర్ 12( ఆంధ్రప్రభ): తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దామినేడు ఇందిరమ్మ ఇళ్ల నందు ఆదివారం కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్నినిర్వహించిన‌ట్లు తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఆదివారం తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు దామినేటి ఇందిరమ్మ ఇళ్ల వ‌ద్ద త‌నిఖీలు నిర్వహించిన‌ట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు ఉక్కు పాదం మోపుతామన్నారు. అక్రమంగా సారాయి, గంజాయి తోపాటు బెల్ట్ షాపులు నిర్వహిస్తే స‌హించేది లేద‌న్నారు. కార్డెన్ సెర్చ్‌లో ప‌త్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలు, 13 ఆటోలను, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో తిరుచానూరు ఎస్సై, అరుణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply