బొలెరో వాహ‌నం సీజ్‌

ఎడపల్లి, ఆంధ్రప్రభ : బోధ‌న్‌-నిజామాబాద్ ( Bodhan – Nizamabad) ప్ర‌ధాన రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న‌ బొలెరో వాహనాన్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిన్న‌రాత్రి బోధన్ మండలం మందన్న గ్రామానికి చెందిన వ్యక్తులు బొలెరో వాహనంలో ఇసుకను తరలిస్తున్నారు.

స్వాధీనం చేసుకుని పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. గత కొంతకాలంగా ప్రధాన రహదారిపై ట్రాలీ ఆటోలు , టాటా ఏస్, బొలెరో వాహనాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నార‌ని తెలిపారు. కాగా వాహనాన్ని స్వాధీనం చేసుకొని కోర్టుకు నివేదిస్తామని ఎస్సై ముత్యాల రామ తెలిపారు.

Leave a Reply