ఏడుగురికి తీవ్ర గాయాలు

ఏడుగురికి తీవ్ర గాయాలు
కోరుట్ల టౌన్, అక్టోబర్ 10 (ఆంధ్రప్రభ ) : కోరుట్ల–మెట్పల్లి (Korutla – Metpalli) జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారుతీ నగర్ దాబా సమీపంలో ఒక కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఏడుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం… కోరుట్ల పట్టణానికి చెందిన ఏడుగురు యువకులు చాయ్ తాగడానికి దాబాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని జగిత్యాల (jagityala), కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
