ఎస్టీపీతో నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాం..
- చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పి.నరసింహ ప్రసాద్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఎస్టీపీతో నీటి కాలుష్యాన్ని తగ్గిస్తామని చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ (P. Narasimha Prasad) అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ గురువారం కట్టమంచి మామిడికాయల మండి ప్రాంతంలో ఏర్పాటు అనుకూలంగా ఉంటుందేమో అని పరిశీలించడం జరిగినది. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (Sewage Treatment Plant) (STP) నగరంలో నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి సుమారు 34 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనున్నది. స్థల పరిశీలన కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.పుష్పగిరి నాయక్, ఇంజనీర్ ఎం.ఇ.వెంకటరామి రెడ్డి, ఎసీపీ నాగేంద్ర, ఎంహెచ్వో డా.లోకేష్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ అధికారులు, ఇంజనీర్లు, స్థానిక ప్రతినిధులతో STP నిర్మాణం, ప్రాజెక్ట్ రోడ్‌మ్యాప్, భవిష్యత్ నిర్వహణ పద్ధతులు గురించి సమగ్రంగా చర్చించారు. కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ… “చిత్తూరు నగరంలోని నీటి నాణ్యతను పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ హిత విధానాలను అభివృద్ధి చేయడం మా ప్రాధాన్యమన్నారు. ఈ STP ప్రారంభం తర్వాత నగరానికి శుభ్రమైన నీరు అందించగలుగుతాం ” అని చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత, నగరంలోని గృహాల నుంచి వచ్చే సీవరేజ్ ను సమర్థవంతంగా శుద్ధి చేయడం ద్వారా స్థానిక నదులు, కూల్‌వాటర్ గడ్డలు, పర్యావరణ పర్యవేక్షణకు మేలు జరుగనుందన్నారు.