శ్రీశైలం, నల్లమలపై ఫోకస్ పెట్టండి

శ్రీశైలం, నల్లమలపై ఫోకస్ పెట్టండి

  • బీ అలెర్ట్.. రోడ్లు బాగు చేయండి
  • అవసరమైతే.. ఇతర జిల్లాల ఇంజనీర్లను రప్పించండి
  • ప్రధాని రాకతో రోడ్డు భవనాల శాఖ మంత్రి బిజీబిజీ
  • ఇంజనీర్లకు మంత్రి జనార్థన్ రెడ్డి దిశానిర్ధేశం

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల 16వ తేదీన పర్యటించనున్ననేపథ్యంలో తొలుత నంద్యాల జిల్లాలోని శ్రీశైలం(Srisailam) పుణ్య క్షేత్రం శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదిదంపతులను దర్శనం చేసుకోనున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, ఆర్ అండ్ బీ శాఖ(R&B Department) ఎస్ ఈ, ఈఈలతో రాష్ట్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి(BC Janardhan Reddy) నేపథ్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన వేళ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. నల్లమల్ల అడవి ప్రాంతంలోనూ ట్రాఫిక్ రద్దీ(traffic congestion) ప్రాంతాలను గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.

దేశ ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతీయ రహదారుల్లో అకస్మాత్తుగా ట్రాఫిక్ స్థంభించిపోయే సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా ఎస్కేప్ రోడ్డు(Escape Road) మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శ్రీశైలంలో స్థానికంగా రహదారుల మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర జిల్లాల ఆర్ అండ్ బీ శాఖ అధికారులను ఉపయోగించుకుని, సమర్థవంతంగా, అప్రమత్తంగా, వ్యవహరించాలని ఆదేశించారు.

Leave a Reply