- తెరమీదకు పిడుగుపాటు కథనం
- శ్రీకాకుళ జిల్లాలో విషాదం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రా ఒడిశా సరిహద్దు శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ఓ క్వారీలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. గంగరాజుపురం గ్రామానికి సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరో నలుగురు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.
వీరిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్వారీలో పేలుడు చోటు చేసుకున్నట్టు ప్రచారం సాగింది. గతంలో ధీన బంధుపురంలో క్వారీ పేలుడుకు ముగ్గురు చనిపోతే అప్పట్లో కూడ పిడుగు అంటూ ప్రచారంచేశారు. ఈనేపథ్యంలో పట్టుపురం వద్ద క్వారీ వద్ద జరిగిన ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బీహారీ శ్రావణ్ కుమార్, రాజస్థానీ హేమరాజ్, మరో వ్యక్తి పింటు మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. మెళియాపుట్టి తహాసీల్దార్ బడే పాపారావు , పాతపట్నం ఎస్ ఐ మధు సూధనరావు విచారణ ప్రారంభించారు.