జీవన విధానం మార్చుకోవాలి
నల్గొండ, ఆంధ్రప్రభ : మానసిక ఒత్తిడికి గురికాకుండా జీవన విధానంలో మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(Like Tripathi) అన్నారు. ఈ రోజు నల్లగొండ ఎన్జీ కళాశాల(Like Tripathi) మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భాన్ని ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరు ఎదో రకంగా మానసికంగా బాధపడుతున్నారని, మరికొందరు మానసిక వత్తిడికి లోనవుతున్నారన్నారు. అయినప్పటికీ మనం ఈ సమస్యను పక్కన పెడుతున్నామని, మానసిక వత్తిడి తగ్గాలంటే జీవన విధానం మార్చుకోవాలని అన్నారు.
సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి
స్మార్ట్ ఫోన్‌ను సాధ్యమైనంతగా తగ్గించాలని, ప్రత్యేకించి పాఠశాల, కళాశాల విద్యార్థులు స్మార్ట్ ఫోన్(Smart Phone)ను పక్కన పెట్టాలని కలెక్టర్ అన్నారు. పెద్దలు సైతం రాత్రి సమయాలలో వత్తిడి లేకుండా ఉన్నప్పుడే మంచి నిద్రతో పాటు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
మానసిక ఆరోగ్యం పై లయన్స్ క్లబ్(Lions Club) జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ రేపాల మదన్ మోహన్(Repala Madan Mohan), తీగల మోహన్ రావు, నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.