దేవరగట్టులో మాళమల్లేశ్వర స్వామి భవిష్యవాణి ఇదే
( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో )
కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన మాళమల్లేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం పూజారి మల్లయ్య స్వామి సంప్రదాయ భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా రైతుల పంటల ధరలపై కీలక సూచనలు చేశారు. ఈ ఏడాది జొన్న ధర రూ.3,400 వరకు ఉంటుంది. పత్తి ధర రూ.7,200 వరకూ పలుకుతుంది. గంగమ్మ తల్లి ఉత్తర భాగాన కూర్చుంది. ఉత్తరాది రాష్ట్రాలలో ఈసారి అధిక వర్షాలు కురిస్తాయి, అని భవిష్యవాణి తెలిపారు. ప్రతి ఏడాది దసరా సందర్భంగా దేవరగట్టు ఉత్సవాలలో స్వామి భవిష్యవాణి స్థానిక విశేషంగా మారింది. రైతులు, భక్తులు ఈ భవిష్యవాణి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు.