తుఫ్రాన్ ప్ర‌జ‌ల ఆందోళ‌న‌..

మెద‌క్, ఆంధ్ర‌ప్ర‌భ : మెద‌క్ జిల్లాలో చిరుత పులి సంచారం మ‌ళ్లీ క‌ల‌క‌లం సృష్టించింది. తుఫ్రాన్ మండ‌లం అట‌వీ ప్రాంతంలో గ‌త మూడు రోజులుగా చిరుత సంచ‌రిస్తోంది. ఈ మేర‌కు స్థానికులు చూసి అట‌వీ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. గ‌తంలో కూడా చిరుత సంచ‌రించిన సంగ‌తి విదిత‌మే. చిరుత సంచారంతో స్థానికులు, రైతులు పొలాల‌కు వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్నారు. చిరుత‌ను బంధించాల‌ని స్థానికులు అట‌వీ శాఖ అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. రాత్రిపూట ఒంటరిగా పొలాల‌కు వెళ్లొద్ద‌ని అట‌వీశాఖ అధికారులు హెచ్చ‌రించారు.

Leave a Reply