దుర్గా నాగ‌మ‌ల్లేశ్వ‌ర గుడి ప్రారంభించిన పొంగులేటి

సత్తుపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లలో శ్రీ‌శ్రీ‌శ్రీ దుర్గా నాగ‌మ‌ల్లేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని ఈ రోజు రాష్ట్ర రెవెన్యూ, స‌మాచార , గృహ‌నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప్రారంభించారు. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా రేజ‌ర్ల‌ గ్రామంలో ఆల‌యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు.

మంత్రి పొన్నం శ‌మీ పూజ‌

క‌రీంన‌గ‌ర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రజలందరి జీవితాల్లో విజయదశమి వెలుగులు నింపాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. విజయదశమి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని కోతి రాంపూర్ గిద్దె పెరుమాండ్ల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శమీ పూజ లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ , సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Reply