గతంలో కంటే పెన్షన్ పెంచాం

గతంలో కంటే పెన్షన్ పెంచాం

  • ఎమ్మెల్యే కూన రవికుమార్

పొందూరు, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం(Srikakulam) జిల్లా పొందూరు మండలం లోని కోటిపల్లి, మజ్జిలిపేట(Majjilipet) గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు ఆమదాలవలస శాసన సభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవి కుమార్(Coona Ravi Kumar) పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అవ్వా తాతల ముఖంలో ఆనందం చూడటం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, పేదల కోసం ఎన్నివేల కోట్లైనా ఖర్చు పెట్టడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) 3000 రూపాయలు పింఛన్ 4000 కి పెంచారని, వికలాంగుల పింఛన్(Disability Pension) 6000 పెంచారనికి పెంచారని అలాగే 100 శాతం వికలాంగులకి 15000 రూపాయలు ఇస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు.

ఒక పెద్దకొడుకు మాదిరిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అవ్వ తాతలకు ప్రతినెలా ఒకటో తారీకు లేదా ఒకరోజు ముందుగానే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ అందిస్తూ మేమున్నామని ధైర్యాన్నికల్పిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నేతలు పీఏసీఎస్(PACS) మాజీ చైర్మన్ కూన సత్యా రావు , పొందూరు మండల పార్టీ అధ్యక్షులు రామ్మోహన్, బలగ శంకర్ భాస్కర్(Shankar Bhaskar), గ్రామ మాజీ సర్పంచ్ గురుగుబెల్లి జనక చక్రవర్తి పాల్గొన్నారు.

Leave a Reply