హోంమంత్రి అనితకు ఆహ్వానం
విజయనగరం, ఆంధ్ర ప్రభ : విజయనగరం(Vizianagaram)లోని శ్రీ పైడితల్లి సిరిమాను జాతర మహోత్సవం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం(Visakhapatnam) క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha)కు ఆహ్వాన పత్రిక అందజేశారు.
పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ శిరీష(Sirisha) హోంమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి అక్టోబర్ 7న జరగనున్నసిరిమాను(Sirimanu) ఉత్సవానికి ఆహ్వానించారు. ఈ ఉత్సవాన్నికూటమి ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించిన నేపథ్యంలో, దీనిని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల(Sakhala) సహకారంతో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.