ఎయిర్‌పోర్టు క్షుణ్ణంగా త‌నిఖీలు

ఎయిర్‌పోర్టు క్షుణ్ణంగా త‌నిఖీలు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : శంషాబాద్ ఎయిర్ పోర్టు(Shamshabad Airport)కు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టారని ఈ–మెయిల్(E-mail) వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు(checks) చేశారు. ఈ రోజు ఉదయం 6:23 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈ-మెయిల్ వచ్చింది.

ఎయిర్ పోర్టు బిల్డింగ్(building) సమీపంలో బాంబులు(bombs) పెట్టామని అందులో ఉంది. ఈ మేరకు భద్రతా అధికారు(Security Officer)లు వెంటనే అప్రమత్తమై ఎయిర్‌పోర్టు బిల్డింగ్‌తో పాటు పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ(Inspection) చేశారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసుల(Police)కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply