స్వచ్ఛత హై సేవకు స్ఫూర్తి
- విజయనగరం జిల్లా కలెక్టర్ తాను సైతం
(విజయనగరం, ఆంధ్రప్రభ ) : సూపర్ కలెక్టర్.. సూపర్.. తన కలెక్టరేట్ లో పిచ్చి మొక్కలు తీసి.. చీపురు పట్టి శుభ్రం చేసి పారిశుధ్యంపై విజయనగరం (Vizianagaram ) ప్రజలకు కలెక్టర్ స్ఫూర్తిగా నిలిచారు. పరిసరాల పరిశుభ్రత పాటించడం అందరి బాధ్యత అని, ఆ మేరకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి (Collector S. Ramasunder Reddy) పిలుపునిచ్చారు.
గురువారం కలెక్టరేట్ లో స్వచ్ఛత హై సేవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రోజుకో గంట సమయం సేవకి కేటాయించాలని కలెక్టర్ (Collector) కోరారు. కలెక్టర్ తో బాటు జేసీ సేదుమాధవన్, ఇతర అధికారులు, నాయకులు, మున్సిపల్, కలెక్టరేట్ సిబ్బంది కలెక్టరేట్ లో స్వచ్ఛత కార్యక్రమం లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు.
