చెత్తకుప్పలో పండంటి బిడ్డ
- ఆనంతపురంలో విషాదం
అనంతపురం బ్యూరో, ఆంధ్ర ప్రభ : ముక్కు పచ్చలారని శిశువు చెత్తకుప్పలోవేశారు. సాయి నగర్(Sai Nagar)లో విషాదం చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో ఆ తల్లికి తన బిడ్డని పేగు తెంచిన మరుక్షణమే అనంతపురం(Anantapur) సాయి నగర్ ఏడవ క్రాస్‌లో వదిలేసి వెళ్లిపోయింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు( Police) ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యవంతంగా ఉందని డాక్టర్లు(Doctors) తెలిపారు.

