ఇన్‌ఫ్లో… 3,67,638 క్యూసెక్కుల వరద
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నాగార్జున సాగర్ ప్రాజెక్టు(Nagarjuna Sagar Project)కు వరద నీరు పోటెత్తింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నభారీ వర్షాల కారణంగా సాగర్ ప్రాజెక్టులోకి 3,67,683 క్యూసెక్కుల(Cusack’s) వరద నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను(26 crust gates) ఎత్తి వరద నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులకు కాగా, ప్రస్తుతం రిజర్వాయర్(reservoir)లో 586.50 అడుగుల నీటిమట్టం ఉంది.
- ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వలు 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 302.91 టీఎంసీల(TMCs) నిల్వ ఉంది.
- 26 క్రస్ట్ గేట్లలో ఎనిమిది గేట్లు ఐదు ఫీట్లు, 18 గేట్లు పది ఫీట్ల(feet) మేర ఎత్తి నీటిని అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు.
- కుడి కాలువ ద్వారా 9019 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
- ఎడమ కాలువ ద్వారా 2818 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
- ఎగువ ప్రాంతం నుండి వస్తున్న3,67,683 అంతే మొత్తంలో ప్రాజెక్టు(project) నుండి విడుదల చేస్తున్నారు.