రైతు సేవ కేంద్రాలకు ఎరువుల సరఫరా..
- ఎరువులు పారదర్శకంగానే అందిస్తున్నాం – ఏవో రామారావు
ఎలాంటి తారతమ్యాలు లేకుండా పారదర్శకంగా ప్రతి ఒక్క రైతుకు యూరియా అదే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మండల వ్యవసాయ అధికారి రామినేని రామారావు అన్నారు. మండల కేంద్రమైన శావల్యపురంలో రైతు సంఘం నాయకులు మంగళవారం ఉదయం ఏవోను కలిసి యూరియా సరిగా అందడం లేదని రైతు సేవ కేంద్రాలలో నిల్వ ఉంచాలని వినతి పత్రం అందజేశారు.
వినతి పత్రం అందించిన వార్తను ఆంధ్రప్రభ వెబ్ న్యూస్ ద్వారా ప్రచురించడం జరిగింది. దీనిపై వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించారు.
మంగళవారం సాయంత్రం రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో ఏవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంఘం నాయకుల వినతుల మేరకు రైతు భరోసా కేంద్రాలకు యూరియా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
మండలంలోని వేల్పూరు, కొత్తలూరు, పొట్లూరు, శానంపూడి, మతుకుమల్లి, పిచికలపాలెం గ్రామాల రైతు సేవా కేంద్రాలకు 10 టన్నుల ఏరియా చొప్పున 60 టన్నులు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పంటకు సరిపడా యూరియా మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని సూచించారు.

