11గేట్లు ఎత్తి నీటి విడుదల…
భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో కిన్నెరసాని (Kinnerasani) నది పరవళ్లు తొక్కుతుంది. గోదావరి (Godavari) ఉపనది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పెరుగుతున్న వరదకు అప్రమత్తమైన అధికారులు 11గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం కిన్నెరసాని (Kinnerasani) ప్రాజెక్ట్ లోకి 12 వేల క్యూసెక్కుల వస్తుండగా, 11గేట్లు ఎత్తి 10 వేలు క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 237.8 అడుగులకు చేరుకుంటుంది.

