బాసర , ఆంధ్రప్రభ : ఎగువన మహారాష్ట్ర(Maharashtra)లో భారీగా కురుస్తున్న వర్షాల(rains)కు బాసర(Basara) వద్ద గోదావరి నదికి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలోని నాందేడ్ పర్బాని జిల్లా పరిధిలో వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో గోదావరి నది(Godavari River)కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద ఉధృతి పెరుగుతుండడంతో గోదావరి నది తీరం వద్ద పుణ్యస్థనాల పోలీసులు అనుమతిని ఇవ్వడం లేదు. గోదావరి నది లోపలికి వెళ్లకుండా ప్రత్యేకంగా భారికేడ్(barricade) లు ఏర్పాటు చేశారు.

గోదావరి బ్యాక్ వాటర్ తో ఆలయం నుంచి గోదావరి నదికి ఉండే మార్గంలో వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసుల, రెవెన్యూ అధికారులు(Revenue Officers) గోదావరి నది వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

