పసిడి ధర ఎంతంటే..?

ఆంధ్ర ప్ర‌భ వెబ్ డెస్క్ః బంగారం ధర(gold price) రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. మునుపు ఎన్నడూ లేనంతగా గోల్డ్ ధర అధికమైంది. గోల్డ్ రేట్‌.. ప్రస్తుతం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ109,420లకి చేరింది. నిన్న కంటే ఈరోజు ధర రూ.20లు త‌గ్గింది. కాగా 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100,302లకి చేరింది. అయితే.. బంగారంతోపాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. షేర్‌‌ మార్కెట్‌ నుంచి బులియన్‌ మార్కెట్‌కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం కేజీ వెండి ధ‌ర రూ.125,100 ఉంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ ఓవైపు.. బంగారం ధర ఇంకా పెరుగుతుందన్న వదంతుల వల్ల డిమాండ్‌ అమాంతం పెరిగిపోయి ధరలు భగ్గుమంటున్నాయి.

భారత దేశ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.109,400 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.100,283 గా ఉంది. వెండి కేజీ(silver kg) ధర రూ.125,070గా ఉంది.

విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Visakhapatnam)లో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ109,400 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.100,283గా ఉంది. వెండి కేజీ ధర రూ.125,070గాఉంది.

ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల బంగార ధర 109,040, 22 క్యారెట్ల ధర రూ.99,953లుగా ఉంది. వెండి కిలో ధర రూ.124,660లుగా ఉంది.

ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల బంగార ధర109,230, 22 క్యారెట్ల ధర రూ.100,128లుగా ఉంది. వెండి కిలో ధర రూ.124,880లుగా ఉంది.

చెన్నై(Chennai)లో 24క్యారెట్ల బంగారం ధర రూ.109,540ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ100,412గా ఉంది. వెండి కిలో ధర రూ.125,240గా ఉంది.

Leave a Reply