చాయ్ పే చర్చలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : అరాచక పాలన కావాలా.. అభివృద్ధి పాలన కావాలా అనే అంశంపై ప్రజల్లో చర్చ జరగాలని, ఎవరి హయాంలో ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి జరిగిందో మీరే ఆలోచించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు (Ap BJP Presidet) పీవీఎన్ మాధవ్ (PVN Madhav) సూచించారు. శుక్రవారం విజయవాడ (Vijayawada) నగరంలోని కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్‌లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు. పలుస్థా నిక సమస్యలను ప్రజలు మాధవ్ దృష్టికి తీసుకువచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల (Central and State Governments) పని తీరుపై తమ అభిప్రాయాలను ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, అనేక ఆలోచనలు, చర్చలతో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని వివరించారు. ప్రజల నాడీ, వారి సమస్యలను తెలుసుకునేందుకు తాము చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని మాధవ్ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం అందరం క‌లిసి అడుగులు వేద్దామని పేర్కొన్నారు.

జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమరావతి రాజధాని ప్రాంతం దెబ్బతిన్నదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి (Amaravati) రాజధాని ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఉద్ఘాటించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం (Airport) అభివృద్ధి చెందుతుందని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతిలో వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. త్వరలోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందడం అందరూ చూస్తారని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా ఆలోచనలు చేయాలని సూచించారు. అరాచక పాలన కావాలా.. అభివృద్ధి పాలన కావాలా అనే చర్చ పెట్టాలని కోరారు.

ఎవరి హయాంలో ఈ దేశానికి, రాష్ట్రానికి మంచి జరిగిందో మీరే ఆలోచించాలని సూచించారు. ఆత్మ నిర్భర్ భారత్ (India) కోసం అందరం క‌లిసి అడుగులు వేద్దామని పేర్కొన్నారు పీవీఎన్ మాధవ్. ‘ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, అక్కడి‌ విశిష్టతను గుర్తించి వాటిని‌ కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. టీ తాగుతూ… ప్రజల ఆలోచనలు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా చెబితే సూచనలు స్వీకరిస్తాం. ప్రజలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలను, వారి ఆలోచనలు, సూచనలు తెలుసుకోవడం ద్వారా ఆ ప్రాంతానికి, రాష్ట్రానికి ఇంకా మంచి చేసే అవకాశం ఉంటుంది.

జీఎస్టీ తగ్గింపుతో మధ్యతరగతికి మేలు
జీఎస్టీ పన్నులు (GST Taxes) తగ్గించి పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉపశమనం కలిగించారు. నిత్యావసర వస్తువుల ధరలు బాగా తగ్గడం ద్వారా ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. సిగరేట్, గుట్కా వంటి మత్తుపదార్థాలకు, లగ్జరీ కార్లకు మాత్రం నలభై శాతం పన్ను పెంచారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రజల మనిషి… ప్రజల మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

జాతీయ రహదారుల (National Highways) కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం (ORR Construction) జరుగుతోంది. అన్ని రకాల‌ పరిశ్రమలు ఏపీలో ఏర్పాటు అవుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా ప్రజల ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. 75 వసంతాల స్వాతంత్య్ర కాలంలో ఎంతో పురోగతి సాధించాం. వచ్చే పాతికేళ్లల్లో ప్రపంచంలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉండాలనేది మన లక్ష్యం. మన ప్రాంతాల్లో తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలి’ అని పీవీఎన్ మాధవ్ సూచించారు.

Leave a Reply