ఆంధ్రప్రభ, హైదరాబాద్ : రాష్ర్టంలోని పర్జలందరికీ ఆరోగ్య భీమా(insurance) కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ(Universal Health Policy)కి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో కుటుంబానికి ఏడదదికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. రాష్ర్టంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్యసేవ హైబ్రిడ్(Hybrid) విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. 3,257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది. రూ. 2.5 లక్షలలోపు వైద్య చికిత్సల క్లెయిమ్‌లు ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం రూపొందించారు. రూ.2.5 లక్షల నుంచి 25 లక్షల వరకూ వ్యయాన్ని ఎన్‌టీఆర్ వైద్య సేవ ట్రస్ట్భ(NTR Vaidya Seva Trust) రించనుంది.
మరోవైపు కొత్త వైద్యశాలల విషయంలోనూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ(PPP) విధానంలో రాష్ర్టంలో10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు.

