బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇవాళ అసెంబ్లీ(Assembly)లో పంచాయతీ రాజ్ చట్ట సవరణ(Panchayat Raj Act Amendment)పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాట్లాడారు. ఈ బిల్లు సాధనకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ఢిల్లీలో అమరణ దీక్ష చేపట్టాలని అన్నారు. ఈ బిల్లుకు సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి (Prime Minister) దగ్గర అఖిలపక్షానికి సమయం తీసుకోండి, తాము కూడా వచ్చి బలంగా మద్దతు ఇస్తామన్నారు.
గతంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తూ తెలంగాణ సాధించుకుని వస్తా అని చెప్పి పోయారని, దమ్ముంటే రేవంత్ రెడ్డి కూడా అదే మాదిరి ఢిల్లీకి పోయి బీసీ బిల్లు సాధించేదాకా అవసరమైతే జంతర్ మంతర్ (Jantar Mantar)లోనే కూర్చోవాలని అన్నారు. అంత కమిట్మెంట్ నిబద్ధత ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఉండాలన్నారు. అపాయింట్‌మెంట్‌లు అడిగితే ఢిల్లీలో చెప్పులు ఏత్తుకుని పోతారని చెబుతారని, రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అపాయింట్‌మెంట్‌లు ఎందుకు ఇస్తారు? ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి, మాట తీరు మార్చుకోవాలని సూచించారు..
బీసీల రిజర్వేషన్లు తెలంగాణలో ఆమోదం పొందకముందే… తెలంగాణ ప్రజల సొమ్ముతో బీహార్ ముఖ్యమంత్రి ( Bihar Chief Minister)తన ఫోటోలతో పత్రిక ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడని కేటీఆర్ అన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు ఓబీసీ వెల్ఫేర్ శాఖ పెట్టాలని డిమాండ్ చేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. 2004లోనే కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ (BC Welfare Department) పెట్టాలని కేసీఆర్ గారు డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
2002లోనే బీసీ పాలసీని పార్టీ తరఫున తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. 42% రిజర్వేషన్ల (42% Reservation) విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుపోయిందని, అందుకే తమ పరిధిలో లేని అంశంపై చట్టం తీసుకువచ్చి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎంతమంది ఉంటే అంత ప్రాతినిధ్యం ఉండాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని, మరి ఎందుకు 42% రిజర్వేషన్ అంశాన్ని ఆయన పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడడం లేదు? అని ప్రశ్నించారు.
మార్చిలో బిల్లు పాస్ చేసిందానికి, దీనికి తేడా ఏమిటో ఇప్పుడు చెప్పండి. అప్పుడు చేసిన దానికి, ఇప్పుడు చేసిందానికి తేడా ఏమిటి? అప్పుడు చేయని రాష్ట్రపతి, గవర్నర్ ఇప్పుడు ఎలా చేస్తారు? ప్రభుత్వాలు చేసిన చట్టాలు లొసుగులు లేకుండా చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. కేవలం బీసీ డిక్లరేషన్లు ఇచ్చి వదిలేస్తే సరిపోదు, డెడికేషన్ ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, గతంలో తాము పెట్టిన పంచాయతీరాజ్ చట్టంలో మున్సిపల్ చట్టంలో ఎక్కడా సీలింగ్ అనే అంశం లేదన్నారు.

