పారిస్ : భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌లు మరోసారి ప్రపంచ వేదికపై తలపడేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు పారిస్‌లో జరగనున్న బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ 2025 టోర్నీలో.. భారత్ తరపున లక్ష్య సేన్, పీ.వి. సింధు, సత్వీక్స్‌రాజ్–చిరాగ్‌ శెట్టి జోడీతో పాటు పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు పోటీలో అడుగుపెట్టనున్నారు.

భారత బ్యాడ్మింటన్ స్క్వాడ్..

  • పురుషుల సింగిల్స్: లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్
  • పురుషుల డబుల్స్‌: సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి-చిరాగ్‌ శెట్టి, హరిహరన్‌ అంశకరుణన్‌-రూబన్‌ కుమార్‌ రెతినాసబాపతి
  • మహిళల సింగిల్స్: పీవీ సింధు
  • మహిళల డబుల్స్: ప్రియా కొంజెంగ్‌బామ్-శ్రుతి మిశ్రా, రుతపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా
  • మిక్స్‌డ్ డబుల్స్: ధృవ్ కపిల-తనీషా క్రాస్టో, రోహన్ కపూర్-రుత్విక గద్దె

🏸 లక్ష్య సేన్‌కు గట్టి సవాల్

ఒలింపిక్స్‌లో పతకం చేజారిన నిరాశతోనే లక్ష్య సేన్ మళ్లీ పారిస్ బరిలోకి దిగుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో ఉన్న సేన్, తొలి రౌండ్‌లోనే ప్రపంచ నంబర్ వన్ షి యూ క్వి (చైనా)ని ఎదుర్కోనున్నాడు. 2021లో కాంస్య పతకం గెలిచిన తర్వాత లక్ష్య ప్రదర్శనలో పెద్దగా మెరుగులు లేకపోవడంతో ఈసారి అతనిపై అదనపు ఒత్తిడి ఉండనుంది.

🏸 ప్రణయ్‌కి డేన్మార్క్ అడ్డంకి

2023లో బ్రాంజ్ గెలిచిన హెచ్‌.ఎస్. ప్రణయ్ మొదటి రౌండ్‌లో ఫిన్లాండ్ ఆటగాడు ఓల్డోర్ఫ్ను ఎదుర్కొంటాడు. కానీ రెండో రౌండ్‌లోనే డేన్మార్క్ స్టార్ ఆంటోన్సెన్ను తలపడాల్సి ఉండటం అతనికి కఠిన పరీక్ష కానుంది

🏸 ప్రణయ్‌కు డేన్మార్క్ సవాల్

2022 ఆసియా గేమ్స్, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్స్ కాంస్య పతకాలు సాధించిన హెచ్‌.ఎస్. ప్రణయ్ తొలి రౌండ్‌లో ఫిన్లాండ్ ఆటగాడు ఓల్డోర్ఫ్‌తో తలపడనున్నాడు. అయితే రెండో రౌండ్‌లోనే డేన్మార్క్ స్టార్ ఆంటోన్సెన్ ఎదుర్కోవాల్సి రావడం ప్రణయ్‌కు గట్టి సవాల్‌గా మారనుంది.

🏸 సింధు కంబ్యాక్ ఛాన్స్

రెండు ఒలింపిక్‌ పతకాలు, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన పీ.వి.సింధు ప్రస్తుతం తన ఫామ్ కోసం తపిస్తోంది. ఇటీవల చైనా ఓపెన్‌లో సహచరురాలు ఉన్నతి హూడా చేతిలో ఓటమి చవిచూసిన సింధు, ఈసారి తొలి రౌండ్‌లో బల్గేరియాకు చెందిన నల్బాంటోవాతో తలపడనుంది.

అయితే మూడో రౌండ్‌లోనే ప్రపంచ నంబర్‌ 2 చైనా స్టార్ వాంగ్ జియీ సవాల్ ఎదురయ్యే అవకాశముంది. ఇది సింధు తిరిగి పుంజుకోవడానికి కీలకమైన పరీక్ష కానుంది.

🏸 సత్వీక్–చిరాగ్ జోడీపై ఆశ‌లు..

డబుల్స్‌లో భారత అగ్రజంట సత్వీక్స్‌రాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి తొలిరౌండ్‌ బైతో నేరుగా రెండో రౌండ్‌లో అడుగుపెట్టనుంది. అక్కడ వారు సహచర జోడీ లేదా చైనీస్ తైపీ ఆటగాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.

రౌండ్ ఆఫ్ 16లోనే చైనాకు చెందిన లియాంగ్–వాంగ్ జంట బలమైన అడ్డంకిగా నిలవనుంది. ఇక‌ క్వార్టర్ ఫైనల్స్‌లో మలేషియా జంట ఆరోన్ చియా – సోహ్ వూయిక్ తో పోటీ ఉండొచ్చు. ఇది సత్వీక్–చిరాగ్ జంటకు కఠిన పరీక్ష కానుంది.

🏸 ఇతర విభాగాల్లో భారత సవాళ్లు

మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిలా–తనిషా క్రాస్టో జోడీ మొదటి రౌండ్ బైతో నేరుగా రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మరోవైపు రోహన్ కపూర్–రుత్విక శివాని జంట మకావో ఆటగాళ్లను ఎదుర్కోనుంది. మహిళల డబుల్స్‌లో ప్రియా కొంజెంగ్‌బం–శృతి మిశ్రా జంటతో పాటు పాండా సిస్టర్స్ కూడా బరిలో నిలుస్తున్నారు.

మొత్తం‌గా గాయాలు, ఫామ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈసారి పారిస్ వేదికపై మరోసారి విజయాన్ని రుచి చూడాలన్న పట్టుదలతో బరిలోకి దిగనున్నారు.

Leave a Reply