ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సారా టెండుల్కర్(Sara Tendulkar).. ఈపేరు చెప్పగానే సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) గారాల పట్టి అని ఎవరైనా చెప్పేస్తారు. సారా తన స్నేహితులతో కలిసి సొంతంగా ముంబైలో ‘పిలాటిస్ స్టూడియో’(‘Pilates Studio)ను ప్రారంభించింది. ఇటీవల దానిని సచిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తన కూతురుని పొగడ్తలతో ముంచెత్తారు.
కల సాకారానికి సారా ఎంతో శ్రమించింది.
‘తల్లిదండ్రులుగా మన పిల్లలు తమకు నచ్చిన రంగంలోకి వెళ్లాలని కోరుకుంటాం. సారా సొంతంగా పిలాటిస్ స్టూడియో ప్రారంభించడం మా హృదయాలను ఉప్పొంగేలా చేసింది. వెల్నెస్కు సంబంధించిన స్టూడియో పెట్టాలనేది ఆమె డ్రీమ్. తన కలను సాకారం చేసుకునేందుకు సారా ఎంతో శ్రమించింది. చెప్పాలంటే ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు.. ప్రతిదీ తనే స్వయంగా సమకూర్చుకొని ఈ స్టూడియోకు రూపమిచ్చింది. పోషకాహారం తీసుకోవడం, చలిస్తూ ఉండడం.. ఈ రెండూ మనందరి జీవితాల్లో చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని పెంచే ఈ రెండిటిని మేళవించిన తన రంగంలో తాను ముందుకెళ్లడం నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. సారా నిన్ను చూసి గర్వపడకుండా ఉండలేకపోతున్నా. నీ కలల ప్రయాణం మొదలవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని సచిన్ భావోద్వేగంతో చెప్పాడు.