• 10 కిలోల గంజాయి స్వాధీనం
  • పోలీసులు అదుపులో కారుతో సహా ఆరుగురు నిందితులు
  • కొన్నేళ్లుగా గుట్టుగా గంజాయి వ్యాపారం
  • పట్టణంలోని ప్రముఖ హోటల్ యజమాని సూత్రధారి
  • వైజాగ్ ప్రాంతం నుంచి కొండవీడు ట్రైన్ లో పుట్టపర్తికి సరఫరా
  • పుట్టపర్తి నుంచి వాహనంలో కదిరికి సరఫరా


శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 20 (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి (Kadiri) పట్టణంలో గంజాయి కలకలం రేకెత్తిస్తోంది. పట్టణానికి చెందిన ప్రముఖ హోటల్ యజమాని గంజాయి వ్యాపారంలో సూత్రధారిగా ఉన్నట్లు సమాచారం. గత కొన్ని ఏళ్లుగా హోటల్ యజమాని గంజాయి వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి కదిరి అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ నిరంజన్ రెడ్డి (CI Niranjan Reddy) ఆధ్వర్యంలో పోలీసులు కదిరి రూరల్ పరిధిలోని కొండమనాయుని పాలెం వద్ద మాటు వేసి, పుట్టపర్తి నుంచి కారులో గంజాయి (Ganja) ని తీసుకొస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో ఏడు కిలోల నుంచి 10 కిలోల వరకు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కారులో ఉన్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టారు.

కాగా గత కొన్ని ఏళ్లు గా విశాఖపట్నం (Visakhapatnam) నుంచి పుట్టపర్తికి వచ్చే కొండవీడు ట్రైన్ లో కొంతమంది వ్యక్తులు బిక్షగాళ్ళ రూపంలో ఉంటూ గంజాయి ని తీసుకువచ్చి పుట్టపర్తి లో కొందరు వ్యక్తులకు అందజేసి, తిరిగి వెళ్ళిపోతుంటారని తెలుస్తోంది. గంజాయి విక్రయ దారులు కదిరి, హిందూపురం, ధర్మవరం, పెనుకొండ ప్రాంతాలకు తరలిస్తారని తెలిసింది. ఇదే విషయాన్ని ఇదివరకు జిల్లా పోలీసులు సైతం చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక సరిహద్దు (Karnataka border), వైజాగ్ నుంచి ట్రైన్ లో అదేవిధంగా వాహనాలలో గంజాయిని తరలించి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. కదిరి పట్టడానికి సంబంధించి ఒక ప్రముఖ హోటల్ యజమాని గత కొన్నేళ్ళు గా గంజాయి వ్యాపారాన్ని గుర్తుగా సాగిస్తూ వస్తున్నారని తెలుస్తోంది.

ముఖ్యంగా యువతకు ఎక్కువగా గంజాయిని అమ్ముతూ వారి ద్వారా హైస్కూల్ స్థాయి నుంచి ఇంటర్ డిగ్రీ కళాశాల వరకు గల విద్యార్థులకు చేరవేస్తున్నట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా కదిరి పట్టణం (Kadiri town)లోని హైస్కూల్, కాలేజీ, కళాశాల స్థాయిలో విద్యార్థులు గంజాయి వాడకంకు అలవాటు పడగా గంజాయి మత్తును తరచూ హైస్కూలు కళాశాలలలో గొడవలు సైతం దిగుతుండేవారు. ఇటీవల కదిరి రూరల్ పరిధిలోని కాలసముద్రం గ్రామంలో కొంతమంది యువకులు గంజాయి మత్తులో ఇతర యువకులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మరి జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది.

ఇది ఇలా ఉండగా గతంలో ఒక ప్రైవేట్ హోటల్లో (private hotel) గల గదిలో యువతీ యువకులు అశ్లీల సంఘటనలకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే హోటల్ యజమాని గంజాయి సంఘటనలో సూత్రధారిగా ఉన్నాడని తెలుస్తోంది. పుట్టపర్తి నుంచి కదిరికి తరలిస్తున్న వాహనం కూడా సదరు హోటల్ యజమానికి సంబంధించిందని సమాచారం.

Leave a Reply