ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒక బస్ కండక్టర్ నుంచి భారతీయ సినీ చరిత్రలో అతిపెద్ద ఐకాన్‌గా ఎదిగిన రజినీకాంత్(Rajinikanth) తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ (Super star)గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అది నిరంతర శ్రమ, కాలానికి తగ్గట్టుగా మారే తత్వం, ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రజనీకాంత్ ఏ సపోర్టు లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి తమ స్వశక్తి తో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు. రజినీకాంత్ కెరియర్ మొదట్లో విలన్ పాత్రలను పోషించినప్పటికి ఆ తర్వాత నెమ్మదిగా హీరోగా వరుస సక్సెస్ లను సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఆయన చెరగని ముద్ర వేశాడు…ఇక తన కెరియర్ లో భాషా, నరసింహ, చంద్రముఖి, శివాజీ, రోబో, జైలర్ (Bhasha, Narasimha, Chandramukhi, Shivaji, Robot, Jailer) లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా స్టార్ హీరోగా రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. ముఖ్యంగా ఈ ఏజ్ లో ఏ హీరోకి పెద్దగా మార్కెట్ అయితే ఉండదు. కానీ రజనీకాంత్ మాత్రం ఈ ఏజ్ లో కూడా భారీ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడనే చెప్పాలి. రజనీ సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో పూనకాలే. అంతలా చిన్నవారి నుంచి పెద్దల వరకు ఆయన చిత్రాలను విపరీతంగా ఆదరిస్తారు. సినిమాల్లో ఆయన స్టైల్, డైలాగ్, స్టెప్పులకు థియేటర్లు ఈలలతో దద్దరిల్లిపోవాల్సిందే. ఇలా గత 50 ఏళ్లుగా ఒకే స్థాయిలో స్టార్ డమ్ కొనసాగిండం ఒక్క ‘తలైవర్’ కు మాత్రమే సాధ్యమైంది.
బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్..
నిజ జీవితంలో బస్ కండక్టర్ (Bus Conductor)గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. 1975 సంవత్సరంలో అపూర్వ రాంగాంగళ్ సినిమాతో తమిళ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శివాజీ రావు గైక్వాడ్ (Shivaji Rao Gaikwad) అలియాస్ రజనీకాంత్.. తన నట జీవన ప్రయాణానికి తిరుగేలేకుండా పోయింది. ఆ సినిమా తర్వాత రజనీకాంత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతులేని కథతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. 2025 సంవత్సరంలో కూలీ చిత్రంతో సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకొన్నారు. భాషా, నరసింహ, అన్నామలై, పెదరాయుడు, ముత్తు, బాబా, చంద్రముఖి, రోబో, కబాలీ, కాలా, పేట, దర్బార్, జైలర్, వేట్టయాన్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా ఆలరించారు.
స్టైల్‌కు పర్యాయ పదం.. రజనీ
రజనీకాంత్ స్టైల్ (Rajinikanth Style) గురించి … ఆయన సినిమాలు సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సినిమాలో సరికొత్త అవతారంతో కనువిందుచేసే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ తలతిప్పినా, కన్ను కదిపినా, కాలు కదిపినా సంచలనమే. స్టైల్‌లో ఆయనకాయనే సాటి. సిగరెట్‌ను గాల్లోకి ఎగిరేసి పెదాలతో పట్టుకోవడం, దాన్ని అగ్గిపుల్లతో ఇంకా స్టైల్ గా వెలిగించుకోవడం లాంటి స్టైల్స్ ఇండియన్ స్క్రీన్‌పై మరెవ్వరికీ సాధ్యం కాదంటే అతిశయోక్తికాదు. కమల్ హాసన్‌లా ఆయనకు నేషనల్ అవార్డు రాకపోవచ్చు. కానీ ప్రేక్షకుల చప్పట్లు, ఈలలే ఆయనకు వేలకొద్ది నేషనల్ అవార్డులతో సమానం. దక్షిణ భారత చలన చిత్ర చరిత్రలో ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌ల తరువాత అంతులేని అభిమాన జన సం దోహం ఉందంటే అది రజనీకాంత్ ఒక్కడికే. మరే నటుడికి కూడా ఇంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదంటే అతిశయోక్తి కాదు.
50 ఏళ్ల తర్వాత కూడా తగ్గని స్టార్‌డమ్
లేటెస్ట్ గా విడుదలైన’కూలీ’తో రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం మరో శిఖరం చేరింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రంలో హై- యాక్షన్‌తో పాటు ఎమోషనల్ కోర్‌ను కూడా అందించారు. ‘తలైవర్’ నుండి అభిమానులు ఆశించే థ్రిల్, మనసును మెప్పించే కథనాన్ని అందించారు. ‘కూలీ’ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను బద్దలు కొట్టాయి. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు ప్రేక్షకులు క్యూకడుతున్నారు. సినిమా విడుదలను ఒక పండుగలా జరుపుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ తగ్గిపోతున్న తరుణంలో రజనీ క్రేజ్ మాత్రం రోజు రోజుకు మరింత పెరుగుతోంది.
యూత్‌కు ఇన్స్పిరేషన్ గా..
బాలీవుడ్ ఇండస్ట్రీకి అమితాబచ్చన్ ఎలాగో, సౌత్ సినిమా ఇండస్ట్రీకి రజనీకాంత్ కూడా అంతటి గొప్ప క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న ఆయన తమిళతో పాటు తెలుగులో కూడా విశేషమైన ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. రోబో (Robo) సినిమాతో సౌత్ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు…ఇక ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానం లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికి వాటిని తట్టుకొని నిలబడి సూపర్ స్టార్ గా ఎదిగాడు… ఇప్పుడున్న యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలిచాడు…
మోదీ స్పెషల్ విషెస్..
సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. “రజనీకాంత్ గారి ప్రయాణం అత్యంత ప్రభావవంతమైనది. ఆయనే కాకుండా, ఆయన పోషించిన పాత్రలు కూడా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇటువంటి చరిత్రాత్మక సినీ జీవితం, ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన రజినీకాంత్ గారికి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుతున్నాను.” అని పేర్కొన్నారు.
చంద్రబాబు శుభాకాంక్షలు..
“సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 50 అద్భుత సినీ సంవత్సరాల పూర్తి చేసిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయనే కాదు, ఆయన సినిమాలు కూడా సమాజంపై ప్రభావం చూపించాయి. ఆయన్ని చూసి లక్షల మంది స్పూర్తి పొందారు” అంటూ చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ స్పెషల్ ట్వీట్..
స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సూపర్ స్టార్ కి శుభాకాంక్షలు అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. బిగ్ స్క్రీన్ పై సూపర్ స్టార్ రజినీ పేరు కనిపించగానే థియేటర్ అంతా ఏ విధంగా మారుమోగుతుందో.. ఎన్నో సార్లు చెన్నైలో చూశాను. తరలు మారుతున్న ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు! ఆస్థాయిలో అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు రజినీకాంత్ సినీ రంగంలో 5 దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. సినీ జీవితంలో స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న రజినీ కాంత్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు.
కమల్‌హాసన్ ఇలా..
అర్ధ శతాబ్దంపాటు సినిమాటిక్ బ్రిల్లియెన్స్‌ను అందించిన నా ప్రియ మిత్రుడు రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్ల అద్బుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకొన్నారు. ఆరాధనపూర్వకంగా, ప్రేమతో నేను ఈ ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకొంటున్నాను. గోల్డెన్ జూబ్లీ సమయంలో కూలీ విజయం రీసౌండ్ ఇవ్వాలి. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్, ఈ సినిమాకు మూలస్థంభంలా నిలిచిన నిర్మాత కళానిధి మారన్. అనిరుధ్ అద్బుతమైన సంగీతం, నా చిరకాల మిత్రులు సత్యరాజ్, నాగార్జున అక్కినేని, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబీన్, నా ముద్దుల కూతురు శృతిహాసన్‌కు కంగ్రాట్స్ అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

